భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 8
టుడే 9 ప్రతినిధి
భద్రాచలం ప్రధమ శ్రేణి జ్యూడిషియల్ కోర్ట్ నందు లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా సీనియర్ మహిళా న్యాయవాది ఎం. వి. రమణ ని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటి చైర్మన్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎస్.సరిత నియమించారు. ఎం. వి.రమణ ఈ పదవిలో మూడు సంవత్సరాలపాటు కొనసాగుతారు. నిరుపేద కక్షిదారులకు న్యాయ సహాయం అందిస్తానని, ప్రజలలో న్యాయ అవగాహన పెంపొందించుటకు కృషి చేస్తానని, తనని లీగల్ ఎయిడ్ కౌన్సిల్ గా నియమించిన జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీస్ చైర్మన్ కి, భద్రాచలం జ్యూడిషియల్ ప్రధమశ్రేణి న్యాయమూర్తి శివ నాయక్ కి, సీనియర్ న్యాయవాదులకు ఎం. వి. రమణ కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్,ప్రధాన కార్యదర్శి పి. శ్రీనివాసాచారి, సీనియర్ న్యాయవాదులు ఎం. వి. రమణారావు, నండూరి శ్రీనివాస్, పలివెల నర్సింహా రావు,గొడపర్తి నాగరాజు, విద్యాసాగర్,గణపతి రావు, చైతన్య, శ్రీమన్నారాయణ, రావి రామ్ మోహన్, పేరాల నాగరాజు, పామరాజు తిరుమలరావు, కిషోర్, అవులూరి సత్యనారాయణ, సంకా నర్మద, లలిత, తరుణీ రజని, పేరాల వెంకటేశ్వర్లు తదితర న్యాయవాదులు ఎం. వి. రమణ కి అభినందనలు









