భద్రాచలం మే 08
టుడే 9 ప్రతినిధి
యేసుక్రీస్తు బోధనలు ప్రతీ ఒక్కరికీ అనుసరణీయం అని అంతర్జాతీయ సువార్త గాయకులు, సంగీత దర్శకులు బ్రదర్ జాకబ్ భూషణ్, విమోచన ప్రేయర్ మినిస్టరీస్ ఫాదర్ రెవరెండ్ ప్రకాశరావులు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎ.ఎస్.ఆర్ కాలనీ లోని విమోచన ప్రేయర్ మినిస్టరీస్ చర్చినందు విమోచన ఉజ్జీవ మహా సభల ప్రారంభ సభలో వారు మట్లాడారు. పరిశుద్ధంగా ఉండి, నీతి, నమ్మకం ఉండే వారితో దేవుడు
సహవాసం చేస్తాడని శోధనల నుండి తప్పిస్తాడని,
సమాధాన పరుస్తాడని తెలిపారు. ఈ మహా సభలు ఆదివారం వరకు ఉదయం, సాయంత్రం జరగనున్నాయి.









