కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  భద్రాచలంలో గిరిజన విద్యార్థుల వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం…

 

భద్రాద్రి కొత్త గూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 9
టుడే 9 ప్రతినిధి

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన గిరిజన ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల విద్యార్థుల 15 రోజుల వేసవి శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించి ముగించడం జరిగిందని పి ఎమ్ ఆర్ సి ఏసీఎంవో రమేష్ అన్నారు.

శనివారం నాడు భద్రాచలం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ బాలికల ఆశ్రమ పాఠశాలలో వేసవి శిక్షణ శిబిరం ముగింపు సమావేశంలో జిసిడివో అలివేలు మంగతాయారుతో కలిసి ఆయన పాల్గొన్నారు. 15 రోజుల వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న నృత్యాలు, పాటలు, యోగ, ఆర్ట్ & క్రాఫ్ట్ ప్రదర్శనలు తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ సమ్మర్ క్యాంపులో నిర్వహించేది విద్యార్థినీ విద్యార్థులలో దాగివున్న నైపుణ్యాలను వెలికితీయడానికి వారికి ఇష్టమైన క్రీడలు ఇతర కళలపట్ల మక్కువ కలిగించి ఉత్తములుగా తీర్చిదిద్దడానికి ఈ క్యాంపులు ఎంతో ఉపయోగపడతాయని, 15 రోజులుగా మీరు నేర్చుకున్న ప్రతి అంశాలను ప్రతిరోజు సాధన చేసి మీరు అనుకున్నది సాధించేవరకు విశ్రమించకూడదని అన్నారు.
అనంతరం జి సి డి వో అలివేలు మంగతాయారు మాట్లాడుతూ 15 రోజుల వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థులు వారికి ఇష్టమైన కళలు .ఇతర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి నేర్చుకొని పరినీతి చెందారని ఈ సందర్భంగా వారి ప్రతిభను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ఆమె తెలుపుతూ వేసవి సెలవులలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థిని విద్యార్థులకు వివరించారు.

అనంతరం విద్యార్థినీ విద్యార్థులు నేర్చుకున్న వివిధ అంశాలు వారి మనసులోని భావాలను విద్యార్థుల ద్వారా తెలుసుకున్నారు. విద్యార్థినీ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇటువంటి క్యాంపులు నిర్వహించడం వలన విద్యార్థిని విద్యార్థులు వారికి ఇష్టమైన కళలు క్రీడల పట్ల మక్కువ పెంచుకొని చదువుతోపాటు కళా రంగంలో కూడా స్థిరపడడానికి దోహద పడతాయని, పిల్లలలో దాగివున్న ప్రతిభాపాటవాలను వెలికితీయడానికి ఐటీడీఏ పీవో ప్రత్యేక బాధ్యత తీసుకొని గిరిజన విద్యార్థినీ విద్యార్థుల పట్ల చూపుతున్న కృషికి మా తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పిల్లల తల్లిదండ్రులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం క్యాంపు ఇంచార్జ్ సీహెచ్ సుభద్ర, అసిస్టెంట్ క్యాంపు ఇంచార్జ్ పి.జే నాగరాజు, హెచ్‌డబ్ల్యూఓ వసంత్, పీడీ మహాలక్ష్మి, పీఈటీలు, రిసోర్స్ పర్సన్స్ నటరాజ్, అజ్మీరా విజయలక్ష్మి, నాగలక్ష్మి, సుజాత విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు