*నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలి.
*సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్
*బ్రిడ్జి కూలిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి.
*సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 11
టుడే 9 ప్రతినిధి
ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ వ్యాప్తంగా శివారు కాలనీలలో నీటి ఎద్దడి రోజు రోజుకి పెరుగుతుందని అధికారులు వెంటనే ట్యాంకర్ల ద్వారా మంచినీటి సప్లై చేయాలని సిపిఐఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఏజే రమేష్ డిమాండ్ చేశారు.. సోమవారం స్థానిక చందర్రావు భవనంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రంశెట్టి వెంకట్రామారావు అధ్యక్షతన జరిగిన సిటిఐ ఎం భద్రాచలం పట్టణ శాఖ కార్యదర్శిల సమావేశానికి ఏజే రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మిషన్ భగీరథ ద్వారా అందే గోదావరి మంచినీరు పట్టణ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మిషన్ భగీరథ పేరుతో చేతి బోర్లను గ్రామపంచాయతీ పూర్తిగా వదిలేసిందని ఈ ప్రభావంతో భగీరథ నీరు రాక చేతి బోర్లు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పంచాయతీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పట్టణంలో ఉన్న అన్ని చేతి బోర్లను రిపేరు చేసి వినియోగంలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. 43 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
*బ్రిడ్జి కూలిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలి.
*సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి.
20 14 లో శంకుస్థాపన చేసి పది సంవత్సరాల పాటు నిర్మించిన భద్రాచలం రెండవ బ్రిడ్జి రెండు సంవత్సరాలు ఒక ముందే అప్రోచ్ రోడ్డు కూలిపోటంపై సమగ్ర విచారణ చేపట్టి సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబీ నర్సారెడ్డి డిమాండ్ చేశారు. రెండో బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు కూలిపోయిన సందర్భంలో భారీ వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ఆయన అన్నారు. 1965లో నిర్మించిన మొదటి బ్రిడ్జి ఇప్పటికి ఎక్కువ చెదరకుండా ఉంటే బిజెపి హయంలో నిర్మించిన రెండవ బ్రిడ్జి రెండు సంవత్సరాలకి కూలిపోయిందంటే బిజెపి హయాంలో అవినీతి ఏ స్థాయిలో రాజ్యమేలుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ అవినీతికి పరాకాష్టగా బ్రిడ్జి ప్రమాదం నిలిచిందని అన్నారు. అప్రోచ్ రోడ్డు కూలిపోయిన ఘటనతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారని పర్యాటక కేంద్రమైన భద్రాచలానికి రోజు వందల సంఖ్యలో వాహన రాకపోకలు కొనసాగుతున్నాయని ఈ బ్రిడ్జి నాసిరకంతో నిర్మించడంతో ఏ రోజు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న ఆందోళన నెలకుంటుందని అన్నారు. బ్రిడ్జి కూలిన ఘటనపై స్థానిక ప్రజాప్రతిథులు కూడా నోరు మెదపకపోవడం విడ్డూరంగా ఉందని నర్సారెడ్డి ఎద్దేవా చేశారు. బ్రిడ్జి ఘటనపై అధికారులు చర్యలకు పూనుకోకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో పోరాటాలు ప్రారంభిస్తామని నర్సారెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఐఎం పార్టీద్రాచలం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు డి సీతాలక్ష్మి పట్టణ కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి నకిరేకంటి నాగరాజు కుంజా శ్రీను డి రాఘవయ్య అజయ్ కుమార్ కనక శ్రీ భూపేంద్ర శాఖ కార్యదర్శులు రమణ రవీందర్ రైతులు పాల్గొన్నారు








