శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి. …పాల్గొన్న సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం మే 11
టుడే 9 ప్రతినిధి

డివిజన్ పరిధిలోని మండలాల ప్రజల సౌకర్యార్థం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకున్న ప్రజలకు సంబంధిత అధికారులు వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట అన్నారు.
సోమవారం నాడు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ అధికారుల సమక్షంలో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత అధికారులకు పంపుతూ దరఖాస్తుదారులు కోరిన విధంగా అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఇందులో ముఖ్యంగా రెవిన్యూ సమస్యలు, పింఛన్లు, వివిధ సంక్షేమ పథకాలతో పాటు పలు సమస్యలపై ప్రజలు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన పలు దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ చేసి సంబంధిత డివిజన్ అధికారులకు పంపుతూ, ప్రతి ఫిర్యాదుపై సంబంధిత శాకాధిపతులు వ్యక్తిగత పర్యవేక్షణ చేసి, నిర్ణీత గడువులో పరిష్కారం జరిగేలా చర్యలు చేపట్టాలని, పెండింగ్ లేకుండా చూసుకోవాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు, ఇన్చార్జి ఎంపీడీవో శ్రీనివాస్, డీఏవో రాజేంద్రనాథ్, భద్రాచలం డివిజన్ పరిధిలోని వివిధ శాఖల డివిజనల్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు