శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  భద్రాచలం శాంతినగర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక….

  • భద్రాచలం శాంతినగర్ కాలనీలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ వేడుక.
  • ఇందిరమ్మ గృహాన్ని ప్రారంభించిన భద్రాచలం సర్పచ్.
  • దంపతులను సత్కరించిన సర్పంచ్ పుణెం కృష్ణ.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాబ్యూరో.
భద్రాచలం మే 11
టుడే 9 ప్రతినిధి

భద్రాచలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల ప్రవేశ కార్యక్రమం అంగరంగ వైభవంగా రాష్ట్రంలో నలుమూలల జరుగుతూ ఉండగా, అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో శాంతినగర్ కాలనీలో ఆదినారాయణ దంపతులు ప్రభుత్వం నుంచి పొందిన ఇందిరమ్మ ఇల్లును పూర్తిచేసుకుని ఎంతో ఆనందంగా గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూణెం కృష్ణ ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి సర్పంచ్ కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని గృహప్రవేశ కార్యక్రమాన్ని పూర్తిచేసి అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుడైన ఆదినారాయణ వారి దంపతులకు సర్పంచ్ కృష్ణ సన్మానం చేసి నూతన వస్త్రాలు పెట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. ఈ సందర్భంగా సర్పంచ్ కృష్ణ మాట్లాడుతూ భద్రాచలంలో నిరుపేదలందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేసుకోవాలని దానికి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడానికి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. నిరుపేదలు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశానికి పిలుస్తూ ఉంటే ఎంతో ఆనందంగా ఉందని అర్హులైన ప్రతి ఒక్కరికి భద్రాచలంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం రమాకాంత్, భీమవరపు వెంకటరెడ్డి, నర్రా రాము ధరపునేని రాంబాబు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎడారి ప్రదీప్, యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గాడి విజయ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆకుల వెంకట్, మండల కార్యదర్శి మాచినేని భాను, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు