శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  హెచ్‌సిఏ టుడే లీగ్‌కు ఎంపికైన చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ యువ క్రికెటర్లు..

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో.
భద్రాచలం, మే 13
టుడే 9 ప్రతినిధి

భద్రాచలంలోని చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీకి చెందిన యువ క్రికెటర్లు హెచ్‌సిఏ టుడే లీగ్ క్రికెట్ జట్టుకు ఎంపిక కావడం జిల్లా క్రీడా రంగానికి గర్వకారణంగా నిలిచింది. అకాడమీకి చెందిన రత్న ఆర్యన్, ప్రసన్న కుమార్, హర్షవర్ధన్ నాయుడు, సుహాస్ తమ ప్రతిభతో ఖమ్మం జిల్లా టీమ్‌లో చోటు దక్కించుకుని ప్రతిభ చాటుకున్నారు.

ఈ సందర్భంగా అకాడమీ కోచులు చరణ్ తేజ, రవితేజ మాట్లాడుతూ, క్రీడాకారులు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధనతో ఈ స్థాయికి చేరుకున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి, వారికి సరైన శిక్షణ అందించడం చేతన బెస్ట్ క్రికెట్ అకాడమీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

అంతేకాకుండా, క్రీడాకారులకు ఆధునిక శిక్షణా విధానాలు, ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. చిన్న వయస్సులోనే క్రీడాకారులు ప్రతిభ కనబరచడం అకాడమీకి మరింత గుర్తింపు తీసుకొస్తోందన్నారు.

హెచ్‌సిఏ టుడే లీగ్ వంటి ప్రతిష్ఠాత్మక పోటీలకు ఎంపిక కావడం ద్వారా ఈ యువ క్రీడాకారుల భవిష్యత్తుకు మంచి అవకాశాలు ఏర్పడనున్నాయని క్రీడా నిపుణులు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లా, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోచ్‌లు ఆకాంక్షించారు.

క్రీడాకారుల ఎంపికపై ఖమ్మం జిల్లా క్రీడాభిమానులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు. అకాడమీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు