కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  భద్రాచలం: గంజాయి సేవిస్తూ పట్టుబడిన నలుగురు యువకులు.. పునరావాస కేంద్రానికి తరలింపు

*గంజాయి సేవిస్తూ పట్టుబడిన నలుగురు యువకులను రిహబిలేటేషన్ సెంటర్ కు తరలించిన భద్రాచలం పోలీసులు*

జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాలతో భద్రాచలం పట్టణంలో గంజాయి అక్రమ రవాణా,గంజాయి సరఫరా చేసే వ్యక్తులపై,సేవించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు తెలిపారు. ఇందులో భాగంగా శనివారం భద్రాచలం పట్టణంలో గంజాయి టెస్టింగ్ కిట్స్ ద్వారా చేపట్టిన తనిఖీలలో నలుగురు యువకులకు పాజిటివ్ రాగా,వారికి కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భద్రాచలం పట్టణంలో గల దక్షత సొసైటీ జిల్లా మత్తు పదార్థాల వ్యసన పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని సీఐ తెలిపారు.ఇకపై భద్రాచలం పట్టణంలో విస్తృతంగా మత్తుపదార్థాలు సేవించే వారిపై గంజాయి కిట్స్ ద్వారా తనిఖీలు చేపట్టడం జరుగుతుందని వెల్లడించారు.ఎవరైనా గంజాయిని రవాణా చేస్తున్నట్లు గానీ,సేవిస్తున్నట్లు గానీ తెలిస్తే వెంటనే పోలీసువారికి సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కూడా వెల్లడించారు.మత్తు పదార్థాలకు బానిసలై యువత తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని,తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు