శ్రీ చైతన్య స్కూల్ పేరుపై అనుమానాలు? – ఉస్మానియా విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీ రామ్. కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్!

  ఘనంగా గోదావరి నది హారతి….

 

భద్రాచలం జూన్ 7
టుడే 9 ప్రతినిధి

శ్రీ సీతారాముల వారి సన్నిధి ప్రముఖ దివ్య క్షేత్రం భద్రాచలంలో ప్రవహిస్తున్న పుణ్య గౌతమి మహాముని, వరప్రదాయని గోదావరి నదికి శ్రీరామునికి బహు ప్రీతికరమైన బహుళ సప్తమి శుక్లపక్షం ఆదివారం నాడు నిర్వహించే గోదావరి నదీహారతినీ కనులారా వీక్షించే భక్తులకు ఎంతో ప్రతిష్టాత్మక మైనదని పురోహితులు రామ వజ్జల రవికుమార్ అన్నారు.

ఆదివారం నాడు గోదావరి స్నాన ఘట్టాల వద్ద జరుగుతున్న నదిహారతి కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీ, రెవెన్యూ, దేవాదాయ శాఖల సిబ్బంది, స్థానిక పురోహిత సంఘం పురోహితులు సహకరిస్తుండడంతో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి హారతిని చూడడానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోందనీ ఆయన అన్నారు. పరాభవ నామ సంవత్సరం అధిక జేష్ట మాసం బహుళ సప్తమి శుక్లపక్షం ఆదివారం జరుగుతున్న ఈ పుణ్య కార్యం పురోహితులు గోదావరి హారతి విశేషాలను, అధిక జేష్ఠ మాసం బహుళ సప్తమి విశిష్టతను భక్తులకు తెలిపి, గణపతి పూజ, దీపోత్సవం భక్తులచే వెలిగింప చేసి, భక్తులు స్పృశించిన పూజా ద్రవ్యాలతో, శ్రీరాముని కి, గోదావరి నదికి అష్టోత్తర శతనామార్చన చేసి లోక కళ్యాణార్ధం ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ఈ మహత్కార్యములో గ్రామస్తులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని రామానుగ్రహంతో గోదావరి మాత ఆశీస్సులు పొందుతున్నారని ఆయన అన్నారు.

శాంతి మంత్ర పఠనం జరిపి గోదావరి హారతి కార్యక్రమాన్ని ముగించి రామ వజ్జల రవికుమార్ లక్ష్మి దంపతులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారని, పూజా సామాగ్రి రెడీమేడ్ బట్టల షాప్ అసోసియేషన్ భద్రాచలం వారు అందించారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పురోహితులు సుబ్రమణ్యం శర్మ, వీరభద్ర శర్మ, రామాచార్యులు, ప్రసాద్ శర్మ, కృష్ణ శర్మ ,తేజ శర్మ, హారతులు సమర్పించగా,స్వచ్ఛంద సంస్థలు, స్థానికులు మరియు , అధిక సంఖ్యలోభక్తులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు