కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  ‘రాజకీయాల్లో విరాట్ కోహ్లీ చంద్రబాబు.. క్రెడిట్ చోరీ జబ్బుతో జగన్ బాధపడుతున్నారు’: మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతిలో భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మరియు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ‘విరాట్ కోహ్లీ’ లాంటివారని అభివర్ణించారు. అవతలి వైపు బౌలర్లు ఎవరైనా, ఎన్ని రకాలుగా మారినా క్రీజులో నిలబడి ‘సూపర్ సిక్స్’ కొట్టే ఏకైక బ్యాట్స్‌మన్ చంద్రబాబేనని ప్రశంసించారు. గత ఐదేళ్ల ‘గొడ్డలి పరిపాలన’కు చరమగీతం పాడుతూ ప్రజలు కూటమికి పట్టం కట్టారని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ స్వేచ్ఛ, ప్రశాంతత లభించాయని లోకేష్ పేర్కొన్నారు.

అహంకారం వల్లే గత ఎన్నికల్లో వైకాపా 151 సీట్ల నుండి కేవలం 11 సీట్లకు పడిపోయిందని లోకేష్ ఎద్దేవా చేశారు. తిరుమల శ్రీవారిని నేరుగా ఢీకొట్టడం వల్లే జగన్ మోహన్ రెడ్డికి ఈ గతి పట్టిందని, గతంలో తానే స్వయంగా చంద్రగిరి వేదికగా హెచ్చరించానని గుర్తుచేశారు. ‘వై నాట్ 175’ అన్న వారికి ప్రజలు ‘టీమ్ 11’ మిగిల్చారని ఎద్దేవా చేశారు. రాయలసీమను ‘రాయల్ సీమ’గా మార్చడమే ఎన్డీయే కూటమి లక్ష్యమని, ఇందుకోసం ఒక లక్ష కోట్లతో చేపట్టబోయే ‘మిషన్ రాయలసీమ’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలవబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కియా, రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి దిగ్గజ సంస్థలను రాయలసీమకు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు.

ఇదే సమయంలో వైఎస్ జగన్ పేరుపై లోకేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పేరులో ఉన్న ‘జి’ అంటే జెన్-జీ (Gen-Z) కాదని, అది ‘గొడ్డలి’ అని విమర్శించారు. అంతేకాకుండా జగన్‌కు ‘సీసీడీ’ (CCD – క్రెడిట్ చోరీ డిజార్డర్) అనే వింత జబ్బు ఉందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడి గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి అంతర్జాతీయ సంస్థలను రాష్ట్రానికి రప్పిస్తుంటే, తామే తెచ్చామంటూ జగన్ ప్రెస్ మీట్లు పెట్టి క్రెడిట్ దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సూపర్ సిక్స్ హామీలను, ఉచిత గ్యాస్ (దీపం-2), తల్లికి వందనం, నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ మరియు జాబ్ క్యాలెండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని లోకేష్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు