భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జూన్ 15
టుడే 9 ప్రతినిధి
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రెటరీ శ్రీమతి సీతాలక్ష్మి ఆదేశాల మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గిరిజన గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని విద్యార్థుల కౌన్సిలింగ్ పగడబందీగా నిర్వహించడం జరిగిందని ఆర్ సి ఓ గురుకులం అరుణకుమారి అన్నారు.
సోమవారం నాడు విద్యార్థినీ విద్యార్థులకు విద్యార్థినీ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలకు అడ్మిషన్ కొరకు జరుగుతున్న కౌన్సిలింగ్ ప్రక్రియను ఆమె స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంపీసీ, బైపిసి, మొత్తం 400 సీట్ల గాను కిన్నెరసాని, దమ్మపేట గుండాల యు ఆర్ జె సి కళాశాలలకు 240 మంది బాలురకు, సుదిమల్ల, భద్రాచలం యు ఆర్ జె సి కళాశాలలకు 160 మంది విద్యార్థినిలకు పదవ తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ప్రకారము కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించి కౌన్సిలింగ్కు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులందరికీ గురుకుల జూనియర్ కళాశాలలో చేరడానికి సీట్లు భర్తీ చేయడం జరిగిందని ఆమె అన్నారు.
కౌన్సిలింగ్ ప్రక్రియకు వచ్చిన విద్యార్థిని, విద్యార్థులు విద్యార్థినిల తల్లిదండ్రులతో మాట్లాడి గురుకుల జూనియర్ కళాశాలలో సీట్లు దొరకడమే అదృష్టంగా భావించాలని ఏ సబ్జెక్టులో దొరికిన తప్పనిసరిగా అడ్మిషన్ పొందాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపాల్ మాధవి, వీరస్వామి పద్మావతి, హేమలత, శ్యామ్ కుమార్, సురేష్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
–









