భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో. జులై 19
టుడే 9 ప్రతినిధి
సర్ ప్రక్రియ ఈ నెల 25 నుండి ప్రారంభమవుతున్నందున సంబంధిత బిఎల్వోలు, బి ఎల్ ఎ సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలను పూర్తిస్థాయిలో నమోదు చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి పినపాక నియోజకవర్గ ఎన్నికల అధికారి బి రాహుల్ అన్నారు.
శుక్రవారం నాడు అశ్వాపురం మండలంలోని రైతు వేదికలో అశ్వాపురం మండలంలోని బిఎల్వోలు బి ఎల్ ఎ సూపర్వైజర్లకు సర్ ప్రక్రియలో భాగంగా చేపట్టవలసిన కార్యాచరణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు చాలా సర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నందున సంబంధిత బిఎల్వోలు మరియు బిఎల్ఏలు ఈనెల 25 నుండి జూలై 24 వరకు సర్ ప్రక్రియలో భాగంగా మీ పరిధిలోని అర్హులైన ప్రతి ఓటరు ఇంటికి వెళ్లి ఇనుమరేషన్ ఫారం అందించి అట్టి ఫారం తప్పనిసరిగా తప్పులు లేకుండా ప్రతి ఒక్కరి ఓటర్లకు సంబంధించిన ఆధారాలు పూరించిన తర్వాత ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవాలని ఈ నమోదు ప్రక్రియ ఒక నెల రోజులలో పూర్తి చేయాలని బిఎల్వోలకు సూచించారు. ఎన్యుమరేషన్ ఫారం పూరించేటప్పుడు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా కచ్చితంగా ఉండేలా పేర్లు నమోదు చేయాలని, సూపర్వైజర్లు క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ చేపట్టి సర్వే పనులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఎలాంటి లోపాలు లేదా పొరపాట్లు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ఇంటింటికి తిరిగి కుటుంబ సభ్యుల వివరాలు పారదర్శకంగా నమోదు చేసి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్ ఐ అనూష ఏ ఎల్ ఎం టి లు( మాస్టర్ ట్రైనర్లు) హరమయ్య బిఎల్వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.









