పారదర్శక ఓటర్ జాబితా ప్రక్రియ ప్రారంభించిన:సబ్ కలెక్టర్ మృనల్ శ్రేష్ట.

 

భద్రాచలం జులై 25
టుడే 9 ప్రతినిధి

పారదర్శక ఓటర్ జాబితా కోసం ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో సంబంధిత ఓటర్లు బి ఎల్ ఓ లు అందించిన ఎన్యుమరేషన్ పారాలలో పూర్తిస్థాయి వివరాలు పొందుపరిచి తిరిగి బిఎల్ఓ లకు అందించి దానికి సంబంధించిన రసీదు తప్పనిసరిగా తీసుకోవాలని భద్రాచలం సబ్ కలెక్టర్ మరియు భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ మృనాల్ శ్రేష్ట సంబంధిత ఓటర్లకు సూచించారు.
గురువారం నాడు భద్రాచలం పట్టణంలోని అయ్యప్ప కాలనీలోని 158 వ పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లకు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందించి ఓటర్లకు సూచనలు, సలహాలు ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ పారదర్శక ఓటరు జాబితా కోసం ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఈరోజు నుండి ప్రారంభమైనందున బి ఎల్ ఓ మరియు బిఎల్ఏలు వారి పరిధిలోని పోలింగ్ స్టేషన్లలో ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాలు అందించినప్పుడు తప్పనిసరిగా సంబంధిత ఇంటి యజమాని కుటుంబ సభ్యుల వివరాలు. అర్హులైన వారికి ఓటర్ నమోదు చేయించాలని అన్నారు.ఎన్యుమరేషన్ ఫారం పూరించేటప్పుడు ఓటర్లు తప్పనిసరిగా ఓటర్ ఐడి కార్డ్, ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్ తప్పనిసరిగా తెలిసి ఉండాలని, బిఎల్వోలు అవసరమైతే అడిగే పత్రాలు జనన ధ్రువీకరణ పత్రం, చదువుకున్న వారు పదవ తరగతి మెమో, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్, విద్యుత్ బిల్లు లేదా గ్యాస్ బిల్లు, బ్యాంకు పాస్బుక్, ఇంటి లేదా భూమి పత్రాలు, ప్రభుత్వ ఉద్యోగి ఐడి లేదా పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అందించి మీ పేరు, తల్లిదండ్రుల పేరు, వయసు చిరునామా సరిగా ఉన్నాయో లేదో సరి చూసుకోవాలని, కుటుంబంలోని అందరి సభ్యుల పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో నిర్ధారించు కొని సక్రమంగా పూరించి తిరిగి బిఎల్ఓ లకి అందించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో నయాబ్ తహసిల్దార్ శ్రీమతి వినయ్ శీల శ్రీరామ్, బిఎల్ఓ రమేష్, సూపర్వైజర్ కీర్తి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు