ఓటర్లకు ఏ న్యూ మరేషన్ పారాలు అందించేటప్పుడు అవగాహన కల్పించాలి…

  • ఓటర్లకు ఏ న్యూ మరేషన్
    పారాలు అందించేటప్పుడు
    అవగాహన కల్పించాలి.
  • బీఎల్ఓ లకు సూచన.
    సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

భద్రాచలం జూన్ 28
టుడే 9 ప్రతినిధి

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా పారదర్శకత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో బిఎల్వోలు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారములు అందించేటప్పుడు ఓటర్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని భద్రాచలం నియోజకవర్గం ఈ ఆర్ ఓ మరియు సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట సంబంధిత బి ఎల్ ఓ సూపర్వైజర్లకు సూచించారు.
ఆదివారం నాడు భద్రాచలం మండలంలోని 145 మెడికల్ కాలనీ, 168 వెంకటేశ్వర కాలనీ, 143 గొల్ల బజార్. 173 ఏఎస్ఆర్ కాలనీ లోని పోలింగ్ స్టేషన్ పరిధిలో బిఎల్వోలు. సూపర్వైజర్లతో సర్ ప్రక్రియలో భాగంగా బి ఎల్ వో లు. సూపర్వైజర్లు ఇంటింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫారాల ద్వారా ఓటర్ నమోదు ఏవిధంగా చేస్తున్నది ఆయన పరిశీలించి బి ఎల్ వో లకు ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్లకు అందించేటప్పుడు పాటించవలసిన నియమ నిబంధనల గురించి బి ఎల్ ఓ లకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బిఎల్వో.సూపర్వైజర్లు ఎన్యుమరేషన్ ప్రక్రియ చాలా పగడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఎన్యుమరేషన్ ఫారాలు పూరించేటప్పుడు తప్పులు లేకుండా చూడాలని అన్నారు. సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని ఓటర్లు బిఎల్వోలు . సూపర్వైజర్లు మీ కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యుమరేషన్ ఫారంలలో పూరించేటప్పుడు ఓటరు యొక్క పూర్తి వివరాలు తప్పులు లేకుండా వ్యక్తికి సంబంధించిన పూర్తి ఆధారాలు బిఎల్వోలకు చూపించి పేర్లు నమోదు చేయించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిఎల్వోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు