భద్రాచలం జూన్ 28
టుడే 9 ప్రతినిధి
ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారికి భవిష్యత్తులో అంగవైకల్యం కలగకుండా తల్లిదండ్రులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు.
ఆదివారం నాడు భద్రాచలం పట్టణంలోని సెయింట్ పాల్ హైస్కూల్లో జాతీయ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పోలియో ఒక వైరస్ వ్యాధి అని దానిని చిన్నతనంలోనే నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ పోలియో డ్రాప్స్ పిల్లలకు వేయించాలని కోరారు. అంగవైకల్యం రాకుండా ఉండేందుకు ఈ పోలియో డ్రాప్స్ కాపాడతాయని అన్నారు ప్రతి ఇంట్లో ఐదు సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలందరికీ ప్రతి ఒక్కరూ డ్రాప్స్ వేయించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం భాగస్వాములై చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏడిఎంహెచ్వో సైదులు, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీధర్ పాయం శ్రీనివాస్, వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









