ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఆధ్వర్యంలో. ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ కి సన్మానం…

భద్రాచలం జూన్ 30
టుడే 9 ప్రతినిధి

భద్రాచలం పట్టణంలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ భద్రాచలం ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ బి.రాహుల్ ని కలిసి, ప్రతిష్టాత్మకమైనటువంటి “దేశంలోనే అత్యుత్తమ ప్రాజెక్టు ఆఫీసర్ గా జాతీయ గౌరవం గుర్తింపు. పొందిన ప్రాజెక్టు ఆఫీసర్ రాహుల్ ని సన్మానించినారు.

ప్రభుత్వ పథకాలను సమర్ధవంతంగా గిరిజన ప్రాంతంలో అమలు పర్చినందుకు ట్రైబల్ వెల్ఫేర్ మ్యూజియం స్థాపించినందుకు, విద్యాశాఖలో, వైద్యశాఖలో వినూత్నమైనటువంటి పథకాలను అమలుపర్చినందుకు, వారికి గుర్తింపు రావడం గర్వకారణం, గిరిజన సంక్షేమం కొరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన అంధత్వ నివారణ, కేన్సర్ నివారణ శిబిరాలను నిర్వహించుటకు పీవో సహాయ సహకాల వలన 2500 మందికి కంటి ఆపరేషన్లు, 400 మందికి కేన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం వలన అందరికీ కంటి చూపు మెరుగుపడిందని, వైద్యసేవలు మెరుగుపడినాయని రెడ్ క్రాస్ జిల్లా కన్వీనర్ డా.ఎస్.ఎల్.కాంతారావు తెలిపినారు. గిరిజన ప్రాంతంలో వైద్యసదుపాయాలు విస్తృతపర్చుటకు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాలతో సెక్రటరీ టు గవర్నర్ దాన కిషోర్, రాష్ట్ర ఐఆర్సిఎస్ కార్యదర్శి ఎ. శ్రీరాములు సూచనలతో ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్. అడిషనల్ డైరెక్టర్ డి. వేణుగోపాల్ పాల్వంచలో రెడ్ క్రాస్ సంస్థ భవన నిర్మాణానికి 0.10 జిటిఎస్ స్థలాన్ని కేటాయించినారని, ఈ స్థలం నందు ప్రత్యేక వైద్య కేంద్రం ఏర్పాటు చేయాలని, అందులో ఉచిత కేన్సర్ నిర్ధారణ, ఉచిత డయాలసిస్ సెంటర్, బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని దీని వలన గిరిజన సంక్షేమం, వైద్య సదుపాయలు విస్తృతపరచాలని కోరగా, ప్రాజెక్టు ఆఫీసర్. వెంటనే స్పందించి తగు చర్యలు చేపడతామని తెలపగా, వారికి రెడ్ క్రాస్ తరపున డా॥ఎస్.ఎల్.కాంతారావు ధన్యవాదాలు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో డాఎస్.ఎల్.కాంతారావు జిల్లా కో-ఆర్డినేటర్, డా యం. వి. కోటిరెడ్డి, డా||భాను ప్రసాద్, రొటేరియన్ కె. అబ్రహాం, ప్రముఖ సంఘ సేవకులు లయన్ గాదె మాధవరెడ్డి. లయన్ చావా లక్ష్మీనారాయణ.డా పి.రాజశేఖర్, లయన్ వై. సూర్యనారాయణ. రొటేరియన్ జి, రాజారెడ్డి, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు