భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో జులై 30
టుడే 9 ప్రతినిధి
గిరిజన సంక్షేమ ఆధ్వర్యంలో నడపబడుతున్న జిపిఎస్ పాఠశాలల్లో చదువుతున్న బాలబాలికలకు పునాది నుండే విద్యావ్యవస్థ బలోపేతం కావడానికి ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు ప్రతి పిల్లవానికి అందరికీ అర్థమయ్యేలా ఉపాధ్యాయులు బోధించాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.
మంగళవారం నాడు చర్ల మండలంలోని మారుమూల దట్టమైన అటవీ ప్రాంతంలోని చత్తీస్గడ్ రాష్ట్రంకు ఆనుకొని ఉన్న చెన్నాపురం, ఉయ్యాల మడుగు జిపిఎస్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పిల్లలతో కాసేపు ఉపాధ్యాయుని పాత్ర పోషించిన అనంతరం విద్యార్థి పాత్ర పోషించి ఉద్దీపకం వర్క్ బుక్ సంబంధించిన అంశాలు పిల్లలకు బోధిస్తున్న తీరును మరియు తానే స్వయంగా పిల్లల చేత బోర్డుపై వ్రాయించి వర్క్ బుక్ లోని ప్రతి అంశం పిల్లల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయడంతో పిల్లలు ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు మరియు చతుర్వేద ప్రక్రియలలో వెనుకబడి ఉన్నట్లు ఆయన గమనించి అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పిల్లలందరూ ఉద్దీపకం వర్క్ బుక్ లోని అంశాలు తప్పనిసరిగా ప్రతి పిల్లవానికి తెలిసి ఉండాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వహణ ప్రతిరోజు సక్రమంగా జరగాలని అన్నారు. పిల్లల హాజరు శాతం తక్కువగా ఉండకుండా చూసి, పిల్లలందరూ పాఠశాలకు వచ్చేలా సంబంధిత ఉపాధ్యాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రతిరోజు పిల్లలను తప్పనిసరిగా బడికి పంపించేలా వారి తల్లిదండ్రులకు సూచించాలని అన్నారు.ఉపాధ్యాయులు ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలలకు రావాలని,ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పై అధికారులు దృష్టికి తీసుకొని రావాలని, ఉద్దీపకం వర్క్ బుక్ నిర్వాహణ తప్పనిసరిగా పిల్లలు అర్థం చేసుకొని రాసేలా ఉపాధ్యాయులు పిల్లలను ఉత్తేజపరచాలని అన్నారు. చెన్నాపురం పాఠశాలలో 55 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారని మరొక ఉపాధ్యాయుని నియమించాలని కోరగా త్వరలోనే ఇంకొక ఉపాధ్యాయుడిని నియమిస్తానని పిఓ తెలిపారు.
అనంతరం ఐటీడీఏ పీవో బి రాహుల్ ఆదేశాల మేరకు డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని శ్రీమతి చందన తిమ్మిరి గూడెం జిపిఎస్ పాఠశాలను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని చందన, ఉపాధ్యాయులు రమేష్, శ్రీనివాస్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









