భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలి….

  • భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలను అందించాలి.
  • భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కి వినతి పత్రం.
  • సిఐటియు సీనియర్ నాయకులు ఎంబీ నర్సారెడ్డి.

భద్రాచలం జులై 1
టుడే 9 ప్రతినిధి

భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని అర్హుడైన ప్రతి కార్మికుడికి సంక్షేమ పథకాలను అందించాలని సిఐటియు సీనియర్ నాయకులు ఎం. బి నర్సారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక డిప్యూటీ తాసిల్దార్ ధనియాల వెంకటేశ్వర్లు కి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు లో ఉన్న సంక్షేమ పథకాలను కార్మికులందరికీ వర్తింపచేసేలా కృషి చేయాలని కోరారు. కార్మికుల పిల్లల చదువు కోసం వెల్ఫేర్ బోర్డు నుండి స్కాలర్షిప్ మంజూరు చేయాలని కోరారు. 60 సంవత్సరం నిండిన ప్రతి కార్మికుడికి 6000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని ప్రమాదం జరిగితే కార్మికులకు తప్పకుండా ప్రమాద బీమా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సొంత ఇంటి కలను నిర్వర్తించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన కోడ్లను రద్దుచేసి కార్మిక చట్టాలను యధావిధిగా అమలు చేయాలని అన్నారు. భద్రాచలం పట్టణంలో ఇసుక దొరకగా భవన నిర్మాణ కార్మికులు వలసలకు వెళ్లే పరిస్థితి ఏర్పడుతుందని నర్సారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వం ద్వారా మన ఇసుక మన వాహనం ప్రారంభించాలని కోరారు. ప్రభుత్వమే ఇసుక రీచ్ లను ఏర్పాటు చేసి పట్టణంలోని పేదలందరికీ ఉచితంగా ఇసుక అందించాలని తద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించాలని నర్సారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో పెయింటర్స్ యూనియన్ అధ్యక్షులు ఎస్కే జాకీర్ కార్యదర్శి వేణు భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు ఎస్కే జమీర్ ప్రసాద్ ఎస్ కే మీరా హుస్సేన్ మీరావలి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు