పసుమాములలో దారుణ హత్య: యువకుడి మర్మాంగాలు నలిపి హతమార్చిన స్నేహితులు

తెలంగాణలోని పసుమాములలో ఒక యువకుడి దారుణ హత్య స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్ నుండి పసుమాములకు మారిన నిస్సాని సుహాస్ (22) అనే యువకుడు గంజాయి వ్యసనానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే గంజాయి వ్యాపార లావాదేవీలతో పాటు స్నేహితుల మొబైల్ ఫోన్లు వాడుతూ యువతులకు అసభ్యకర మెసేజ్‌లు పంపడం అలవాటు చేసుకున్నాడు. ఈ ప్రవర్తన కారణంగా సుహాస్‌కు తన స్నేహితులతోనే తీవ్ర విభేదాలు తలెత్తాయి. పాత కక్షలు, వ్యక్తిగత గొడవలు ముదరడంతో స్నేహితులే అతడిపై పగ పెంచుకున్నారు.

బుధవారం తెల్లవారుజామున నిందితులు రాకేష్, పరుశురాం, రాజు మరియు మరో వ్యక్తి కలిసి ఏదో మాట్లాడాలనే నెపంతో సుహాస్‌ను గ్రామ శివారులోని ఒక నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ పాత గొడవలపై చర్చ జరుగుతుండగా మాటా మాటా పెరిగి పెద్ద ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో నిందితులు సుహాస్‌పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. భయపడి పారిపోవడానికి ప్రయత్నించిన సుహాస్‌ను వెంబడించి మరీ దారుణంగా చితకబాదారు. చివరకు యువకుడి మర్మాంగాలు నలిపి, ప్రాణం పోయే వరకు వదలకుండా అక్కడికక్కడే హతమార్చారు.

ఘటనపై సుహాస్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ సాయంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి కీలక ఆధారాలు సేకరించారు. నిందితుల్లో ఒకరిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకోగా, పరారీలో ఉన్న మిగిలిన వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలను వేగవంతం చేశారు. గంజాయి, ఇతర చెడు వ్యసనాలకు బానిసైన యువకులు ఇలాంటి ఘోర నేరాలకు పాల్పడుతుండటంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు