వద్దిపేట చెక్ డ్యాం నిర్మించాలి: ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు న్యూ డెమోక్రసీ వినతి పత్రం

D వినేష్ భద్రాద్రి డివిజన్ ప్రతినిధి..

ఎత్తిపోతల పథకం కింద చర్ల మండలం వద్దిపేట చెక్ డాం నిర్మాణం చేపట్టాలని న్యూ డెమోక్రసి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావును న్యూ డెమోక్రసీ నాయకులు కోరారు …

ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు గత ఎన్నికలకు ముందు చర్ల మండలంలో గిరిజన ఆదివాసీలు సాగు చేసుకునే 25వేల ఎకరాల పంట భూములకు వద్దిపేట చెక్ డ్యాం ద్వారా ఎత్తిపోతల పథకం కింద నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని కార్యరూపం లోకి తీసుకురావటంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు

తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చి వద్దిపేట చెక్ డ్యాం నిర్మించి గిరిజన ఆదివాసి రైతులకు నీళ్లు అందించాలని సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి కామ్రేడ్ ముసలి సతీష్ అన్నారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యావత్ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు రెండు పంటలు పండించుకోవడానికి నీళ్లు అందించకపోవడంలో పాలకులు అధికారులు విఫలమయ్యారని దశాబ్దాలు గడిచిపోతున్న పాలకులు చెక్ డ్యాం నిర్మాణం పట్టించుకోకపోవడం చాలా దుర్మార్గం అని ఆయన అన్నారు

చర్ల మండలంలో ఉన్న రైతులకు రెండు పంటలకు నీళ్లు అందించే విదంగా పాలకులు ఎత్తిపోతల పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొచ్చి చెక్ డ్యాం పనులు మొదలు పెట్టాలని ఆయన అన్నారు తక్షణమే ఎత్తిపోతల పథకం కింద చర్ల మండలంలో సాగులో ఉన్న 25వేల ఎకరాలకి ఎత్తిపోతల పథకం కింద సాగు నీరు అందించాలని అధికారంలోకి రాకముందు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మొట్టమొదట ఇచ్చిన హామీ చెక్ డ్యాం ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్ళు అందిస్తానని చెప్పిన మాటను నెరవేర్చుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తోందని అన్నారు.
ఇప్పటికైనా చెక్ డ్యామ్ విషయంలో స్పందించక పొతే మండలం లో ఉన్న రైతులందరినీ ఐక్యం చేసుకొని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు ప్రజలు రైతులు తదితరులు పాల్గొన్నారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు