•బోటిగూడెంలొ అఖండ యూనివర్సల్ వెల్ఫర్ ట్రస్ట్ ద్వారా 43 మంది అది వాసి పిల్లలకు బట్టలు పంపిణీ
పింపపాక మండలం
అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివాసి ప్రజలకు దుస్తుల వితరణ
Today9News ప్రతినిధి,D రమేష్, మణుగూరు
పినపాక మండలం, బోటిగూడెం గ్రామపంచాయతీ, విప్పల గుంపు ఆదివాసి గ్రామంలో నివసిస్తున్న ఆదివాసీలకు మన నాగరికతను దగ్గర చేయుటలో వారిని మన సమాజంలో ఒకటిగా చూడాలని ఇలాంటి సేవా కార్యక్రమాలలో ప్రజలు ముందుకు వచ్చి మన తోటి ఆదివాసులను ఆదుకోవాలని సుమారు 43 మంది ఆదివాసిపిల్లలకు బట్టలు పంపిణీ చేయడం జరిగింది.
అదేవిధంగా ఈ గ్రామంలోని ఆదివాసీల పిల్లల చదువు కొరకు ఇంకా ముందుకు వచ్చి సేవా కార్యక్రమాలను అందించాలని కోరుతూ….
ఈ కార్యక్రమానికి అఖండ యూనివర్సల్ వెల్ఫేర్ ట్రస్ట్ సభ్యులు కట్ల నరేష్ నాని బాబు, కే నాగేశ్వరరావు, ఆకుల వెంకటేష్, సైదా, నాయుడు, బోటిగూడెం మాజీ సర్పంచ్ సుధాకర్ ఈశ్వరయ్య విప్పల గుంపు గ్రామ పెద్దలు నరసయ్య మడకం రమేష్ తదిపరులు పాల్గొన్నారు.









