ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూల్ శుక్రవారం విడుదలైంది. మే 26న (ఆదివారం) ఈ పరీక్షను నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్‌లో అర్హత పొందిన విద్యార్థులు https://jeeadv.ac.in/index.html రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందు కోసం ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు గడువు ఉంటుంది. మే 6వ తేదీలోపు ఫీజు చెల్లించాలి. మే 17 నుంచి అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉంటాయి.









