ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (artificial intelligence) ఆధారిత డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా ఇటీవల ఆందోళనకర ఘటనలు వెలుగుచూశాయి. ప్రముఖ నటి రష్మిక మందాన్న నకిలీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. డీప్‌ఫేక్ టెక్నాలజీ కారణంగా ఎన్ని దుష్పరిణామాలు ఉన్నాయో ప్రపంచానికి అర్థం అయింది.
ఈ ఘటనపై అప్పట్లోనే సోషల్ మీడియా సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక రిమైండర్‌ను పంపింది. ఇందులో ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల ప్రకారం శిక్షలను హైలెట్ చేసింది. తాజాగా సోషల్ మీడియా సంస్థలకు కేంద్రం మరోసారి కీలక ఆదేశాలు జారీచేసింది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఫ్లాట్‌ఫాంలో డీప్‌ఫేక్ వీడియోలను నియంత్రించాలని స్పష్టం చేసింది. ఇందుకోసం 7 రోజుల గడువు విధించింది.
ప్రస్తుత ఐటీ చట్టంలోని రూల్ 3 (1)(B) ప్రకారం సోషల్ మీడియా వినియోగదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించి 24 గంటల్లోగా 12 రకాల కంటెంట్‌లను తొలగించాలని ఆయా సంస్థలకు ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. భవిష్యత్‌లో ఐటీ నిబంధనలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
సోషల్ మీడియా వినియోగదారులు ఫిర్యాదుచేసిన లేదా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసిన మంత్రి తెలిపారు. సరైన సమయంలో స్పందన లేకుంటే IPC నిబంధనల ప్రకారం చర్యలు తీసుకొనేందుకు రూల్ 7ను అమలు చేస్తామని హెచ్చరించారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత డీప్‌ఫేక్ బాధితులు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సూచించారు. డీప్‌ఫేక్ బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు ఐటీ మంత్రిత్వ శాఖ సాయం చేస్తుందని వెల్లడించారు.
Advertisement
డీప్‌ఫేక్‌లను నియంత్రణకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రెండు రోజుల క్రితం వెల్లడించారు. ప్రసిద్ధ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం సహా ఇతర ప్రతినిధులతో సమావేశం అనంతరం అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని గుర్తించడం మరియు పరిమితం చేసేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందిస్తోందని మంత్రి వెల్లడించారు.
త్వరలో రానున్న కొత్త నిబంధనల ప్రకారం ఇటువంటి డీప్ ఫేక్ నియంత్రణకు రిపోర్టింగ్ ప్రాసెస్‌ను కూడా బలోపేతం చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా సంస్థలు కూడా తన ఆలోచన అర్థం చేసుకున్నాయని, డీప్ ఫేక్‌లపై నియంత్రణ అవసరాన్ని అర్థం చేసుకున్నారని తెలిపారు. మేము నియంత్రణ రూపొందించడం ప్రారంభిస్తామని వెల్లడించారు.
Advertisement
డీప్ ఫేక్‌ల వచ్చే నెలలో మరోసారి సోషల్ మీడియా సంస్థలతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సమావేశం కానున్నారు. ఇటువంటి వీడియోలను రిపోర్టు చేసేందుకు రిపోర్టింగ్ మెకానిజంను బలోపేతం చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా కంపెనీల ద్వారా కొత్త నియంత్రణ చర్యలపై దృష్టిసారిస్తామని చెప్పారు.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.









