అమితాబ్ బచ్చన్, జయా బచ్చన్ దంపతులు తమ కుమార్తె శ్వేతా బచ్చన్‌కు రూ.50 కోట్ల విలువైన ఇంటిని గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబైలోని తమ ప్రతిష్టాత్మక నివాసం ‘ప్రతీక్ష’ను కుమార్తెకు బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. రూ.50.65 లక్షల స్టాంప్ డ్యూటీ చెల్లించి కుమార్తె శ్వేత పేరిట ఇంటిని రిజిస్టర్ చేయించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. నవంబర్ 8న ఈ ప్రక్రియ పూర్తైనట్లు తెలుస్తోంది.









