ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయని సీఎం కేసీఆర్ అన్నారు. సంగారెడ్డిలో కేసీఆర్ మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ తీసేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ధరణి తీసేసి భూమాత తెస్తామంటున్నారు.. అది భూమాతనా.. భూమేతనా? కౌలు రైతులకు రైతుబంధు ఇస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎవరైనా మూడేళ్లు భూమిని కౌలుకు ఇస్తే.. ఆ భూమి మీద హక్కులు పోతాయి. ధరణి తీసేస్తే.. రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి’ అని ప్రశ్నించారు.









