తెలంగాణలో మొత్తంగా 70.53 శాతం పోలింగ్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 29, 30 తేదీల్లో పోలింగ్ విధులు నిర్వహించిన సిబ్బందికి శుక్రవారం సెలవు ప్రకటించారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని తెలంగాణ సీఈవో వికాస్ రాజ్ (Vikas Raj) ఆదేశాలు జారీ చేశారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ప్రత్యేక సెలవు ఇవ్వాలని ఉత్తర్వులు వెల్లడించారు. కాగా, అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు మినహా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.

 

తెలంగాణలో 70.53 శాతం పోలింగ్ నమోదు

 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ పూర్తయింది. ఓటింగ్ పూర్తికావడంతో ఈవీఎంలను అధికారులు స్ట్రాంగ్ రూంలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం టర్నవుట్ యాప్ లో పేర్కొన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలో 70.53 శాతం పోలింగ్ నమోదైంది.

కాంగ్రెస్ అభ్యర్థిపై ఎంఐఎం అభ్యర్థి దాడి

 

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని మలక్‌పేట కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బ ర్‌పై ఎంఐఎం అభ్యర్థి ఎమ్మెల్యే అహ్మద్ బలాల దాడి చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం సైదాబాద్‌లోని జాకీర్‌ హుస్సేన్మైదానం సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో పాటు మరో ఇండిపెండెంట్‌ అభ్యర్థి తనపై దాడి చేశారని షేక్ అక్బర్ సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

షేక్ అక్బర్‌పై దాడి జరుగుతుందనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. లాఠీ ఛార్జీ చేసి గొడవపడుతున్న వారిని చెదరగొట్టారు. ఎంఐఎం అహ్మద్బలాల కిరాయి గుండా అని అక్బర్ మండి పడ్డారు. వారంతా కలిసి తనని చంపే ప్రయత్నం చేసేందుకే ఈ దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా తొలగించాలని అక్బర్కోరారు. పోలీసులపై, ఈసీపై తనకు నమ్మకం ఉందని అక్బర్తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram