బీఆర్‌ఎస్‌ సైన్యం సైలెంట్‌.. ఓటమి ఖరారైందా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలవడనున్నాయి. పోటీదారుల్లో టెన్షన్‌ కొనసాగుతోంది. ఇప్పటకే పోలింగ్‌ సరళి, ప్లస్, మైనస్‌పై సమీక్ష చేసుకున్నారు. దీంతో ఎక్కడ తగ్గింది.. ఎక్కడ పెరిగిందని ఒక నిర్ధారణకు కూడా వచ్చారు. మరోవైపు అన్ని పార్టీల అధ్యక్షుడు కూడా రాష్ట్రస్థాయిలో పోలింగ్‌ సరళిపై సమీక్ష చేసుకున్నారు. ఎవరెవరు గెలుస్తున్నారు. ఎవరెవరు ఓడిపోతున్నారని ఒక నిర్ధారణకు వచ్చారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోష్‌ కనబడుతుండగా, బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ సైలెంట్‌ అయింది. అధికారంలోకి వచ్చే అవకాశం ఉండిఉంటే.. అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చి ఉంటే.. గులాబీ శ్రేణుల్లో కూడా రెట్టించిన ఉత్సాహం కనిపించేది కానీ, తాజా పరిస్థితి చూస్తుంటే.. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ క్యాడర్‌లో నిర్లిప్తత కనిపిస్తోంది.

 

More

From Telangana politics

ఓటమి ఖరారైందా?

ఒక్కటంటే ఒక్క ఎగ్జిట్‌ పోల్‌ లోనూ బీఆర్‌ఎస్‌కు మెజార్టీ వస్తుందని చెప్పకపోగా.. సొంత చానల్‌ లాంటి టీవీ9 కూడా రెండు సీట్లు కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కువ సీట్లు వేయడంతకో బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ పూర్తిగా నిరాశలో మునిగిపోయింది. ఆ పార్టీ సోషల్‌ మీడియా సైనికులు పూర్తిగా సైలెంట్‌ అయిపోయారు. ఓటమికి మానసికంగా సిద్ధమైపోయారు. బీఆర్‌ఎస్‌ తరపున పోటీ చేసిన అభ్యర్థుల్లోనూ పెద్దగా టెన్షన్‌ ఉండటం లేదు. ఓటమి ఖాయమన్న ప్రచారం జరుగుతూండటంతో చాలా మంది కౌంటింగ్‌ ఏజెంట్ల నియామకం విషయంలోనూ పెద్దగా వేలు పెట్టడం లేదు. ప్రధాన అనుచరులకు అప్పగించేస్తున్నారు. తాము అయినా కచ్చితంగా గెలుస్తామనుకున్న అభ్యర్థులే కౌంటింగ్‌ సెంట్రలకు వెళ్లే అవకాశం ఉంది. పోలింగ్‌ పూర్తయినప్పటి నుంచి కేసీఆర్‌ ఓటింగ్‌ సరళిని విశ్లేషించారు.

 

కేసీఆర్‌తో టచ్‌లో..

ఇక పలువురు నేతలు కేసీఆర్‌ను కలిశారు. కానీ పరిస్థితి ప్రోత్సాహకరంగా లేదని అందరికీ అర్థమైంది. అయితే కౌంటింగ్‌ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రభుత్వం మారిపోతుందని తెలిస్తే.. రావాల్సిన సీట్లు కూడా వెనక్కి పోతాయన్న ఉద్దేశంతో .. అందరూ సీరియస్‌గా కౌంటింగ్‌ సెంటర్లకు వెళ్లాలని హైకమాండ్‌ ఆదేశాలు ఇచ్చింది. బీఆర్‌ఎస్‌కు సైలెంట్‌ ఓటింగ్‌ ఉందని నమ్మాలని సందేశం పంపుతున్నారు. అయితే తుది తీర్పు వెలువడే వరకూ ఎంతో కొంత ఆశలు ఉంటాయి కాబట్టి అద్భుతం జరగాలని కోరుకుంటున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram