రన్ వే నుండి జారి సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం
దుబాయ్ నుండి హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కు చెరుకున్న బోయింగ్ 747 విమానం ల్యాండ్ అవుతుండగా, ఒక్కసారిగా అదుపు తప్పి సముద్రంలోకి దూసుకు వెళ్ళిన సంఘటన నెలకొంది.
ప్రమాదంలో ఇద్దరు గ్రౌండ్ స్టాఫ్ మృతి చెందగా.. విమానంలో ఉన్న నలుగురిని రెస్క్యూ సిబ్బంది ప్రాణాలతో కాపాడారు .ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి సముద్రంలోకి జారిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఎయిర్ పోర్టు గ్రౌండ్ సర్వీస్ వాహనంలో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు.
బోయింగ్ 747 విమానం దుబాయి నుండి హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు అధికారులు తెలియజేశారు.
దుబాయ్ నుంచి వచ్చిన తుర్కియే కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయి సముద్రంలో సగం మునిగింది.
గ్రౌండ్ వెహికల్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, ఫ్లైట్లో ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు.









