నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ?

నవంబర్ 3వ తేదీ నుండి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్ ?

ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు చెల్లించకపోతే బంద్ తప్పదని హెచ్చరిక జారీ చేసిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఆ దిశగా కార్యాచరణకు పూనుకున్నట్టు తెలియ వచ్చింది.

గతంలో హా మీ ఇచ్చినట్లుగా నవంబర్ 1వ తేదీ లోపు రూ.900 కోట్ల నిధులు విడుదల చేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు డిమాండ్ చేశాయి

ఈ విషయమై ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు వినతిపత్రం అందజేశారు.ఇది ఇలా ఉండగా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు అత్యవసర భేటీ అయ్యాయి.ఈ నేపథ్యంలో దసరా లోపు రూ.600 కోట్లు చెల్లిస్తామని చెప్పి, ఈ రోజు రూ.200 కోట్లు మాత్రమే ప్రభుత్వం చెల్లించినట్టు పేర్కొన్నారు.తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చని పక్షంలో మరోసారి కాలేజీలను బంద్ చేసే యోచనలో యాజమాన్యాలు ఉన్నట్టుగా తెలుస్తోంది ,ఆ దిశగా ప్రభుత్వ సలహాదారు కేశవరావుకు వినతి పత్రాన్ని అందజేశారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share