టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తోంది….
వైస్సార్సీపీ యూత్ కార్యకర్తల సమావేశంలో నాయకులు కె. రాజ్ కుమార్.
చింతూరు అక్టోబర్ 21: టుడే9 ప్రతినిధి
వైఎస్సార్ సీపీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయటంలో భాగంగా ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కారం అయ్యేంతవరకు తాను ప్రజల వెంటే ఉంటానని హామీ ఇస్తున్నామన్నారు ఆ పార్టీ యువనేత . .ఆల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం లొ ఎమ్మెల్సీ అనంతబాబు ఆదేశాల మేరకు కూనవరం వైస్సార్సీపీ యూత్ లీడర్ కరక రాజ్ కుమార్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో యువనేత రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న తీరును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈ మోసపూరిత ప్రభుత్వానికి నాయకులకు గ్రామాల్లోకి వచ్చి ప్రజలకు చేసింది ఏమీ లేదని పేరుకి మాత్రం సూపర్ సిక్స్ సుపరిపాలన మాటలు తప్ప చేతల్లో లేదని విమర్శించారు. ఈ ప్రభుత్వ పథకాలు ఎలా ఉన్నాయంటే పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఉన్నదని ఎద్దేవా చేశారు. నిజంగా ఈ ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలు తూచా తప్పకుండా అమలు చేయాలని సవాల్ చేశారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కూనవరం మండల యూత్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు









