సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ లో
గిరిజనులకే తొలి ప్రాముఖ్యత ఇవ్వాలి....
ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి బి రాహుల్.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 21: టుడే 9 ప్రతినిధి
ఐటీడీఏ ఆధ్వర్యంలో నడపబడుతున్న గిరిజన అభ్యుదయ భవనం మరియు సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ ఆదివాసి గిరిజనులకు నామమాత్రపు రుసుముతో వివాహది వేడుకలు మరియు సభలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు గిరిజన భవనాలు గిరిజనులకు ముందుగా అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

మంగళవారం నాడు భద్రాచలం పట్టణంలోని తెలంగాణ గిరిజన అభ్యుదయ భవనం , సమ్మక్క సారక్క ఫంక్షన్ హాలును ఆయన పరిశీలించారు. ఈ భవనాల నిర్వహణ తీరు మరియు ఈ భవనాలు ఇతర శుభకార్యాలకు బుక్ చేసుకున్న గిరిజనులకు మరియు ప్రజలకు అందుతున్న సౌకర్యాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద ఆదివాసి గిరిజన కుటుంబాలలో పెళ్లి వేడుకలు కానీ ఇతర కార్యక్రమాలు చేసుకోవడానికి ఈ భవనాలు విశాలవంతంగా చాలా సౌకర్యవంతంగా ఉన్నందున మారుతున్న కాలాన్ని బట్టి మెరుగులు దిద్ది సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా కరెంటు, మంచినీటి సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని, భవనాల ముందు పార్కింగ్ స్థలాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎవరైనా గిరిజనేతరులు ఫంక్షన్ల కోసం ముందుగా బుక్ చేసుకుంటే ఆ తేదీలలో గిరిజనులకు సంబంధించిన ఫంక్షన్ లు ఉంటే గిరిజనులకే ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ అభ్యుదయ భవనం, సమ్మక్క సారక్క ఫంక్షన్ హాల్ లకు సంబంధించిన రికార్డులు సక్రమంగా నిర్వహించాలని అన్నారు. బుక్ చేసుకున్న గిరిజనులకు , ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఫంక్షన్ లు జరిగే రోజు ఈ భవనాల నిర్వహణ పర్యవేక్షిస్తున్న అధికారులు అందుబాటులో ఉండి వారికి కావలసిన వసతులు తప్పనిసరిగా కల్పించాలని, ఈ భవనాలు ఎప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, పరిసరాలలో ఉన్న చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఏవో సున్నం రాంబాబు, డి ఈ హరీష్, టీఎ శ్రీనివాసరావు, పి ఎమ్ ఆర్ సి పర్యవేక్షకుడు కృష్ణార్జునరావ్, పోశాలు తదితరులు పాల్గొన్నారు.









