కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  గోండు బెబ్బులి కొమరం భీం చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఆదివాసీ నాయకులు.

  1. గోండు బెబ్బులి కొమరం భీం చిత్రపటానికి ఘన నివాళులర్పించిన ఆదివాసీ నాయకులు.

తక్షణమే టి.ఏ.సి ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియమాకల చట్టం ప్రకటించాలంటూ డిమాండ్.

పోతవరం గ్రామంలో ఘనంగా కొమరం భీం 124 వ జయంతి వేడుకలు .

అక్టోబర్ 22 : TODAY 9 NEWS ప్రతినిధి…

అల్లూరి సీతారామరాజు జిల్లా,రంపచోడవరం నియోజకవర్గం,దేవీపట్నం మండలం,దేవారం గ్రామపంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామంలో ఉన్న రామాలయం నందు గోండు బొబ్బిలి కొమరం భీమ్ 124 జయంతి వేడుకల సందర్భంగా ఘనంగా పూలమాలలతో నివాళులు అర్పించామని ఏపీ ఆదివాసి జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనాడు నైజాం పాలనకు వ్యతిరేకంగా ఆదివాసీ పోరాటయోధుడు కొమరం భీం జల్ జంగిల్ జమీన్ నినాదం పేరుతో అమాయక ఆదివాసులను చైతన్య పరిచి ఆదివాసీల హక్కులు చట్టాల పరిరక్షణ కోసం,నైజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఐక్యం చేసి అలుపెరగని పోరాటం చేసి వీరమరణం పొందిన ఆదివాసీల ఆరాధ్యదైవం కొమరం భీం అని శ్లాఘించారు.ఈ సందర్భంగా భారత్ ఆదివాసి పార్టీ దేవీపట్నం మండల అధ్యక్షులు చవలం విద్యాసాగర్ మాట్లాడుతూ…కొమరం భీం స్ఫూర్తితో నేటి తరం ఆదివాసీ యువతీ యువకులు షెడ్యూల్డ్ ప్రాంత సంస్కృతిపరిరక్షణ కోసం,నిధులు,నీళ్లు,నియమకాలు ఆదివాసీలకే దక్కాలని శాంతియుత ఐక్య పోరాటాలకు,మలిదశ ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.షెడ్యూల్డ్ ప్రాంతంలోని ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ తక్షణమే స్పందించి టి.ఏ.సి ద్వారా తీర్మానం చేసి షెడ్యూల్డ్ ప్రాంత ఉద్యోగాల నియామకాల చట్టం తక్షణమే ప్రకటించి ఆదివాసి ప్రత్యేక డీఎస్సీ ప్రకటించాలని,అలాగే 35 ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు మరియు ఉపాధి అవకాశాలు స్థానిక ఆదివాసీలకు మొదటి ప్రయారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు అరకులో ఆదివాసీ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.లేదంటే ఆదివాసీలంతా భవిష్యత్తులో ఓటు బ్యాంకుతో తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యూత్ కన్వీనర్, శరభవరం,దేవారం ఎంపీటీసీ సభ్యులు తుర్రం జగదీష్ దొర,కారం రంగారావు దొర,కారం సత్యనారాయణ దొర,మడకం కృష్ణ దొర,కుంజం అబ్బులు దొర,చవలంవెంకాయమ్మ,తాటిగంగాభవాని,కారం శ్రీనివాస్ దొర మొదలైన వారు పాల్గొన్నరన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు