కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులచే రక్తదానం

సినీ హీరో ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులచే రక్తదానం

సేవా గుణం చాటుకున్న యువత

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ​ అక్టోబర్ 23 : టుడే 9 ప్రతినిధి

​సినీ హీరో ప్రభాస్ జన్మదినం సందర్భంగా భద్రాచలంలోని అభిమానులు థియేటర్లకే పరిమితం కాకుండా సామాజిక సేవ చేసి ఆదర్శంగా నిలిచారు. స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పది మంది అభిమానులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

​ఈ సేవా కార్యక్రమానికి పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ. తిరుపతిరావు, పట్టణ ఎస్.ఐ. సతీష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యి మాట్లాడుతూ హీరోల అభిమానులు కేవలం వినోదానికే కాకుండా ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం ద్వారా యువతకు స్ఫూర్తిగా నిలిచరని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాగే మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని వారు అభినందించారు.
​రక్తదానం చేసిన అభిమానులు మాట్లాడుతూ, గతంలోనూ అనేకసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేసి వారిని కాపాడామని సంతృప్తినిచ్చిందని తెలిపారు. తమలాగే ప్రతి ఒక్క హీరో అభిమాని రక్తదానాలు చేసి ‘ప్రాణదాతలు’ కావాలని కోరారు.

​మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొప్పుల మురళి మాట్లాడుతూ, ప్రభాస్ జన్మదినం సందర్భంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన అభిమానులను అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

​ఈ రక్తదాన శిబిరంలో కరుకు శివకుమార్ ఉడతా సందీప్ రెడ్డి, ప్రభు కుమార్, లోకి హృదయ్ వినయ్ వెంకీ సహా పలువురు ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు