మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు

మహిమగల చెంబు ఉందంటూ వైద్యురాలి నుండి రూ.1.50 కోట్లు కాజేసిన కేటుగాళ్లు 

మా వద్ద ఉన్న చెంబులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయంటూ మాయ మాటలు చెప్పి, హైదరాబాద్‌కు చెందిన వైద్యురాలిని  ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు మోసం చేసిన సంఘటన నెలకొంది.హైదరాబాద్‌కు చెందిన ప్రియంక అనే వైద్యురాలిని, మహిమగల చెంబు పేరుతో మోసం చేశారు విశాఖపట్నం అరకులోయకు చెందిన పెందుర్తి శ్రీనివాస్, వనుము శ్రీనివాస్, కొర్రా బంగార్రాజు అనే కేటుగాళ్లు.తమ వద్ద రూ.30 కోట్లు విలువ చేసే మహిమగల చెంబు ఉందని, అందులో డబ్బులు వేస్తే రెట్టింపు అవుతాయని వైద్యురాలిని నమ్మించి రూ.1.50 కోట్లు వసూలు చేశారు నిందితులు.

కాగా ఆరు నెలల గడుస్తున్నా వారి నుండి ఎటువంటి స్పందన లేకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించిన  ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకుని రూ.2,42,400 నగదు, కారు స్వాధీనం చేసుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు