జోర్డాన్ లో చిక్కుకున్న 12 మందిని స్వస్థలానికి చేర్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు..

జోర్డాన్ లో చిక్కుకున్న 12 మందిని స్వస్థలానికి చేర్చిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు

ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే హరీష్ రావును కలిసి కృతజ్ఞతలు తెలిపిన బాధితులు

 

బతుకు దెరువు కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుని బయట పడలేక బాధలు పడుతున్న 12 మందిని స్వస్థలానికి చేర్చారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు.జోర్డాన్లో వారు పనిచేసే కంపెనీకి పెనాల్టీతో పాటు, రవాణా ఖర్చును సైతం భరించి,బాధితులను తెలంగాణాకు రప్పించినందుకు,ఈరోజు ఉదయం ఎయిర్పోర్టులో విమానం దిగి, నేరుగా హరీష్ రావు ఇంటికి వెళ్లి కలిసిన బాధితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు,  ఎంపీలకు ఎన్ని సార్లు తమ సమస్య చెప్పుకున్నా పట్టించుకోలేదని బాధితుల ఆవేదన వ్యక్తం చేశారు.కాగా తమను తిరిగి భారత దేశానికి తీసుకొచ్చిన హరీష్ రావుకు, బీఆర్ఎస్ పార్టీకి జీవితాంతం రుణపడి ఉంటామని,బాధితులు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు