చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల రికార్డు.
♦ అభినందించిన చింతూరు ప్రాజెక్ట్ అధికారి,
♦ సూపరింటెండెంట్, గైనకాలజిస్టుల, సిబ్బంది కృషికి తగ్గ ఫలితం
చింతూరు అక్టోబర్ 27: టుడే 9 ప్రతినిధి
అల్లూరి సీతారామరాజు జిల్లా లో అన్ని ఆసుపత్రులకంటే చిత్తూరు ఆసుపత్రి ప్రసవాల రికార్డు.సృష్టించింది. ఆసుపత్రి చరిత్ర లో ఎన్నడూ లేని విధంగా 100 ప్రసవాలు అక్టోబర్ నెల లో అవ్వడంతో, ఈ రికార్డును సొంతం చేసుకుంది.
పదేళ్ల క్రితం రాష్ట్ర విభజన జరిగాక విలీన మండలాలైన చింతూరు కూనవరం ఎటపాక, వరరామచంద్రాపురం మండలాలకు వైద్య సేవలు అందని ద్రాక్షా గానే మారింది. దీంతో ప్రజలు వైద్య సేవలకోసం నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. ఆసుపత్రి ప్రారంభం నుండి సివిల్ ఆసుపత్రి గా ఉన్న చింతూరు ఆసుప్రత్రి 2018 నుండి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గా అప్ గ్రేడ్ అయ్యింది. 2022 నుండి స్పెషలిస్ట్ వైద్యులను వైద్య ఆరోగ్య శాఖ నియమించడంతో ఈ ఆసుపత్రిలో అన్నీ రకాల వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావడంతో విలీన మండలాలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులో కి వచ్చాయి. చింతూరు ఆసుపత్రి లో ఇద్దరు గైనకాలజిస్తులు, ఆర్థోపెడిక్ ఒకరు, జనరల్ ఫిజిషియన్ ఒకరు, చెవి ముక్కు, గొంతు వైద్యులు, పిల్లల వైద్యులు, అనస్థిసీయా(మత్తు డాక్టర్), ఇద్దరు జనరల్ వైద్యులను నియమించడంతో ప్రజలకు మంచి సేవలు అందే అవకాశం వచ్చింది.
ప్రసవాల పై ప్రత్యేక దృష్టి…
2023లో లో డాక్టర్ ఎం. వీ. కోటిరెడ్డి సూపరింటెండెంట్ గా చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి కి రావడం తో ఆయన ప్రజలకు అన్నీ రకాల వైద్య సేవల పై ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా ప్రసవాలు
పెంచడం అన్ని రకాల ఆపరేషన్ లు చింతూరు లో జరిగే విదంగా ప్రయత్నించడం తో ఆసుపత్రి లో రోజు వారి ఔట్ పేషెంట్స్, ఇన్ పేషెంట్స్ సేవలు బాగా పెరిగాయి. ముఖ్యం గా ప్రసవాలు ఎక్కువగా పెరిగేందుకు చర్యలు తీసుకున్నారు. సూపరింటెండెంట్ డా. ఎం వీ కోటిరెడ్డి, మత్తు డాక్టర్ కావడం, గైనకాలాజిస్ట్ లు డా. ఎం వీ రమణారావు, డా శశికళ సమిష్టి తో ప్రసవా ల పెంపుకు కృషి చేసారు. దీంతో అక్టోబర్ నెల లో 100 ప్రసవాలా టార్గెట్ ను సాధించడం జరిగింది. అల్లూరి సీతారామ రాజు జిల్లా లో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ఎక్కువ ప్రస వాలు జరిగి చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందంజ లో ఉంది.
చింతూరు ఆసుపత్రి లో 2025 జనవరి నుండి అయిన ప్రసవాలు.
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ నెల వరకు అయిన ప్రసవాల వివరాలు, జనవరి 64, ఫిబ్రవరి 48,మార్చి 50, ఏప్రిల్ 68, మే 48, జూన్ 54, జులై 50,ఆగష్టు 92, సెప్టెంబర్ 95, అక్టోబర్ 100 అయ్యాయి.
ఎస్. ఎన్ సీ యూ చిన్న పిల్లల యూనిట్ లో ప్రత్యేకంగా వైద్య సేవలు
చింతూరు ఆసుపత్రి లో చిన్న పిల్లల వైద్య సేవలకోసం కోసం ఏర్పాటు నావజాత శిశు కేంద్రం ( ఎస్ ఎన్ సీ యూ) లో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఏడాది లోపు ఉన్న చిన్న పిల్లలకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లల వైద్యాధికారి డా. మహేష్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాకుండా శిశు మరణాలను తగ్గించేందుకు ఈ యూనిట్ ఉపయోగ పడుతుంది. చిన్న పిల్లల వైద్య సేవల కోసం పిడియట్రీషియన్, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండడం విశేషం.
నాలుగు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి నాలుగు రాష్ట్రాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, ఛత్తేస్ గడ్ రాష్ట్రాల ప్రజలకు ఇదే ప్రధాన ఆసుపత్రి. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి లో స్పెషలిస్ట్ వైద్యులతో పాటు స్కానింగ్, ఎక్స రే, అన్ని రకాల రక్త పరీక్షలు, డా. ఎన్టీఆర్ వైద్య సేవలు, డయాలసిస్ సేవలు, ఎన్ ఆర్ సీ కేంద్రం, ఎస్ ఎన్ సీ యూ కేంద్రం ఉండడంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, చింతూరు ఐటీడీ ఏ ప్రాజెక్టు అధికారి శుభం నొక్వాల్, డీసీ హెచ్ ఎస్ డా. నీలవేణి డిప్యూటీ డీ ఎం అండ్ హెచ్ ఓ డా. పుల్ల య్య సహకారం తో ఆసుపత్రి లో మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది.
ఖాళీ స్పెషలిస్ట్ పోస్టులు, సిబ్బంది పోస్టులు భర్తీ చేయాలి
చింతూరు ప్రభుత్వలో ఖాళీ గా ఉన్న స్పెషలిస్ట్ వైద్యాధికారుల పోస్ట్ లు భర్తీ చేయాలి. ప్రస్తుతం జనరల్ ఫిజిషియన్, ఈ ఎన్ టీ, ఆర్థోపెడిక్, పెడియట్రిక్ వైద్య పోస్టులు భర్తీ చేస్తే ఇంకా ప్రజలకు వైద్య సేవలు అందించ వచ్చు.
100 పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్
చింతూరు ప్రభుత్వ ఆసుపత్రి ఇటీవల 100 పడకల ఆసుపత్రి గా అప్ గ్రేడ్ గా ప్రభుత్వం మంజూరు చేసింది దీంతో ఇక్కడ ప్రజల కు త్వరలో నే ఇంకా మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి









