భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : నవంబర్ 16: టుడే 9 ప్రతినిధి
జిల్లా కేంద్ర గ్రంథాలయం భద్రాద్రి కొత్తగూడెం నందు 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మూడవరోజు చిత్రలేఖన పోటీలను నిర్వహించారు. విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసేందుకుగాను వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులకు చిత్రలేఖన పోటీని నిర్వహించారు. ఈ చిత్రలేఖన పోటీలకు ముఖ్య అతిథిగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు చైర్మన్ మాట్లాడుతూ ఆధునిక సమాజంలో నేడు ఇంటర్నెట్లు సెల్ ఫోన్లు తో బిజీగా ఉన్న నేటి రోజులలో విద్యార్థులు గ్రంథాలయపైన మక్కువచూపడం ఎంతో ఆనందంగా ఉందని బాల్యతరం నుండి భావితరాల ల వరకు గ్రంథాలయాలను ఉపయోగించుకోవడం భవిష్యత్ తరాలకు పునాది అని ఈ వారం రోజులు పాటు జరిగే కార్యక్రమంలో పిల్లలు పాల్గొని వారిలో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకుగాను ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాలలు పిల్లలను పాల్గొనే విధంగా ప్రోత్సహించాలని ఉపాధ్యాయులను కోరారు.

ఈ కార్యక్రమంలో సుమారు 200 పైగా విద్యార్థిని విద్యార్థులు వివిధ స్కూల నుంచి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంథోనీ ప్రభాకర్ డ్రాయింగ్ టీచర్ అక్షయ్ స్కూల్ ప్రిన్సిపల్ విద్యార్థులు చిత్రించిన చిత్రపటాలను పర్యవేక్షణ చేశారు ఈ కార్యక్రమంలో గ్రంధాలయ అధికారి జీ .మణి మృదుల మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇస్తున్న ప్రోత్సాహాన్ని బట్టి ఈరోజు కార్యక్రమాల్లో పాల్గొనడానికి విద్యార్థుల ముందుకు వచ్చారని వారికి తమ గ్రంధాలయం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు మధుబాబు రుక్మిణి జి సబిత ఇన్చార్జి అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎం స్కూల్ చుంచుపల్లి, జి రమాదేవి ఇన్చార్జి హెచ్ఎం జిహెచ్ఎం బాబు క్యాంప్ హై స్కూల్ చుంచుపల్లి మండల్ తోపాటు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాఠకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు









