శివాలయంలో దుర్ఘటన.

ఇద్దరు మహిళలకు గాయాలు.

దుమ్మగూడెం: నవంబర్ 17 :టుడే 9 ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని నరసాపురం చిన్న అరుణాచలం లోని శివాలయంలో మంటలు వ్యాపించి ఇద్దరు మహిళలు గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది.. వివరాల్లోకి వెళితే. కార్తీక సోమరాన్ని పురస్కరించుకొని నర్సాపురం చిన్న అరుణాచలం శివాలయానికి భక్తులు దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో భక్తులు పూజకు నీళ్లు వెతికే క్రమంలో నీళ్లు దొరకకపోవడంతో అక్కడే ఆలయం పక్కకు పెట్టిన కార్పెంటైల్ ను నీళ్లుగా భావించి బాటిల్ లోని ద్రవాన్ని దీపం వైపు చల్లగా అది ఫైర్ అయ్యి మంటలు వ్యాపించడంతో , ఒక భక్తురాలికి మంటలు అంటుకున్నాయి. అది గమనించిన తోటి భక్తులు వెంటనే స్పందించి,ఆమెకు అంటుకున్న మంటలను ఆర్పివేసి, దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నరసాపురంకు తీసుకువెళ్లగా, అక్కడ వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అందించి 108 ద్వారా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి రిఫర్ చేశారు.ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు