ఇది దీర్ఘకాలిక ధర్మయుద్ధం…ఆదివాసీ జేఏసీ…

చట్టబద్దత లేని లంబాడీలను యస్ టి. జాబితా నుండి తొలిగించాలి ….

సర్పంచ్ ఎన్నికలలో స్థానిక ఆదివాసీలకే అవకాశం ఇవ్వాలి.ఆదివాసి సంఘాల జేఏసీ నాయకులు.

భద్రాచలం నవంబర్ 25 :టుడే 9 ప్రతినిధి

తెలంగణా ప్రాంతంలో అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా చట్టబద్దత లేని లంబాడీల సమస్యలపై దీర్ఘకాలిక ధర్మయుద్దాన్ని కొనసాగిస్తామని ఆదివాసి సంఘాల కార్యవరణ కమిటి చైర్మన్ పూనెం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. భద్రాచలంలోని హరిత టూరిజం హోటల్ లో, తెలంగాణ రాష్ట్ర ఆదివాసి సంఘ కార్యచరణ కమిటి స్టీరింగ్ కమిటి సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా హాజరైన వివిధ ఆదివాసి సంఘాల నాయకులు. విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ.. తెలంగాణలో చట్ట బద్దతలేని లంబాడీలు రిజర్వేషన్లను గడిచిన 49 సంవత్సరాలుగా అనుభవిస్తున్నారని ఆదివాసులు ఆవేదన వ్యక్తం చేసారు. లంబాడీల మూలంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలను ఆదివాసులు కోల్పోతున్నారని, చివరకు ఆదివాసుల ఉనికి, సంస్కృతి. సంప్రదాయాలు ప్రశ్నార్థకంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసులు చేస్తున్న ఈ ప్రజా ఉద్యమంలో గిరిజన ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యం లేకపోతే వారిని ప్రశ్నిస్తామన్నారు.

వీలైనంత త్వరగా తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో భద్రాచలం ఐ టి డి ఏ కేంద్రంగా డిసెంబర్ 29వ 2025 వత్సరం వేలాది మందితో ఐ టి డి ఏ ముట్టడి చేస్తామని, 2026 సంవత్సరం జనవరి 4న అన్ని ఆదివాసి సంఘాలతో “చలో మేడారం” కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. 2026 సంవత్సరం జనవరి 12న ఛలో నల్లమల ఐ టి డి ఏ మన్ననూరు ముట్టడి కార్యక్రమాన్ని,2026 సంవత్సరం జనవరి 19న ఛూ ఉట్నూరు ఐ టి డి ఏ ముట్టడి కార్యక్రమం, ఫిబ్రవరి 5 నుండి మార్చి 10 మధ్య ఛలో జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమాల నిర్వహణ కై పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 9న మహబూబాద్, ఫిబ్రవరి 18న భదాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 23న ములుగు కలెక్టరేట్ మార్చి 2న – ఆదిలాబాద్, మార్చి9న ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముట్టడి పిలుపునిస్తున్నట్టు ,అనంతరం’ ఛలో రాజభవన్’ నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశంలో ఆదివాసి సంఘాల నాయకులు గుండుశరత్, పాయం సత్యనారాయణ, జి యస్ పి ఉయిక రవి, ఆదివాసిసేన ఇర్ఫా నర్సింహమూర్తి, నవనిర్మాణసేన. పూనెం రాంచండర్, భూమిదువసంఘం వాసం రాము కృష్ణ. పూనెం కృష్ణ, వాసం నాగరాజు, పూనెం వరప్రసాద్, రమణాల లక్ష్మయ్య, ఇర్పా ప్రకాశ కుంజా శ్రీను పూనెం. వీరభద్రం, సోయం కామరాజు, ఈసాల సురేష్, పర్మిక సతీష్, కీర,శ్రీను, పూనెం వీరభద్రం, తెల్లం రమణయ్య, వర్సా ప్రకాష్, తాటి సుధాకార్ తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram