కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని మోసం చేసింది… కెటిఆర్…

కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కేవలం 17% ఇచ్చి మోసం చేసిందని బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.కాగా కేసీఆర్ బీసీలకు 24 శాతం రిజర్వేషన్లు ఇస్తే రేవంత్ రెడ్డి కేవలం 17 శాతం మాత్రమే ఇచ్చారని దుయ్యబట్టారు.

బీసీలను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ రెండు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు కేటీఆర్.ఇంత మాత్రం దానికి రూ.160 కోట్లు ఖర్చు చేశామని చెప్పి, కులగణన సర్వే చేసి, రాహుల్ రేవంత్ మోడల్ అని బిల్డప్ కొట్టడం దేనికి? అంటూ విమర్శలు చేశారు.పార్టీ గుర్తు లేకుండా జరిగే ఎన్నికల్లో, పార్టీపరంగా రిజర్వేషన్లు ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారుఇంత దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బీసీ ప్రజలు కచ్చితంగా బుద్ధి చెప్తారని జోస్యం చెప్పారు కేటీఆర్.

Facebook
WhatsApp
Twitter
Telegram