ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా నిరసనకు దిగిన ప్రజలు…

*ఇసుక రీచ్ వెంటనే ఆపాలని పురుగుల మందు డబ్బాలతో ప్రధాన రహదారిపై బైఠాయింపు..

*ఆందోళనకు దిగిన గ్రామస్తులపై దాడి చేసిన ఇసుక సొసైటీ సభ్యులు…

ములుగు జిల్లా వెంకటాపురం మండలం అబ్బాయిగూడెంలోని ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా గిరజనులు, గ్రామస్తులు రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు.ఇసుక లారీల వల్ల పంట పొలాలు, రోడ్లు నాశనం అవుతున్నాయని, వెంటనే ఇసుక రీచ్ ను ఆపాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.గ్రామస్తులపై ఇసుక సొసైటీ సభ్యులు చేసిన దాడిలో మహిళ గాయపడగా, స్థానికులు బాధిత మహిళను ఆసుపత్రికి తరలించారు.ఇది ఇలా ఉండగా ములుగు జిల్లా కలెక్టర్ కు ఎన్ని సార్లు చెప్పినా పట్టించు కోవడంలేదని , ప్రభుత్వ పెద్దలు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share