కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్‌లో నల్ల సంచిలో ఉన్న నాటు బాంబును వీధి కుక్క కొరడంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే కుక్క మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది
. వివరాల్లోకి వెళితే,కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో ఒక అండర్ వేర్ లో దాచి ఉన్న నాటు బాంబులను ఒకకుక్క రైల్వే స్టేషన్ లో కి ఎత్తుకు వచ్చింది. మొత్తం ఆరు నాటు బాంబుల్లో ఒకటి కొరికగా, అది పేలడం తో కుక్క అక్కడి కక్కడే మృతి చెందింది. మరో అయిదు బాంబులు పేలకుండా మిగిలాయి. హఠాత్ సంఘటనతో ప్రయాణికులు భయంతో పరుగులు పెట్టగా, పోలీసులు కేసు నమోదు చేసి డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు ప్రారంభించారు. పేలకుండా మిగిలిన నాటు బాంబులను జి అర్ పి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని. స్టేషన్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివ ప్రసాద్ సందర్శించారు. కాగా అడవి పందుల కోసం పంట చేలల్లో పెట్టే నాటు బాంబులుగా భావిస్తున్నారు.సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా సంచి ఉంచిన ఆగంతకుడి కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు….









