భద్రాచలం గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు…

భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని గోదావరి నది కరకట్ట ప్రాంతంలో మొక్కలు నాటి వాటి పోషణ బాధ్యతను మరిచారు అంటూ గ్రామపంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యంపై స్థానికులు, వృక్ష ప్రేమికులు విమర్శలు చేస్తున్నారు. ప్రముఖ పుణ్య క్షేత్రం, పర్యాటక ప్రాంతమైన భద్రాచలం పట్టణాన్ని గ్రీన్ భద్రాద్రిగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పలుచోట్ల మొక్కలు నాటే క్రమంలో , స్థానిక గోదావరి కరకట్టపై మొక్కలు నాటి వాటి పోషణ భారం మరిచారు అంటు స్థానికులు వాపోతున్నారు… ఇకనైనా పంచాయతీ సిబ్బంది మొక్కల వైపు తొంగి చూడాలని కోరుకుంటున్నారు…









