సంగారెడ్డి జిల్లాలో పరువు హత్య…

ప్రేమ విషయం గురించి మాట్లాడదామని ఇంటికి పిలిచి యువకుడిని హతమార్చిన యువతి కుటుంబ సభ్యులు…

సంగారెడ్డి జిల్లాలో జరిగిన పరువు హత్య కలకలం రేపుతోంది.. వివరాల్లోకి వెళితే జ్యోతి శ్రావణ్ సాయి(20) అనే యువకుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మైసమ్మ గూడలోని సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతూ, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో రూమ్ తీసుకుని నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే కాలేజీలో చదువుతున్న సంగారెడ్డి జిల్లా బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ(19) అనే యువతితో శ్రావణ్ గత కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు.ఈ విషయం తెలిసిన యువతి బంధువులు,పెళ్లి గురించి మాట్లాడదామని ఇంటికి పిలిపించి, ఒక్కసారిగా శ్రావణ్ సాయిపై బ్యాట్లతో దాడి చేసినట్టు శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.కాగా తీవ్రగాయాలతో ఉన్న సాయిని యువతి కుటుంబీకులు ఇవాళ ఆస్పత్రిలో చేర్చగా శ్రవణ్‌సాయి అప్పటికే చనిపోయాడని వైద్యులు తెలిపారు.ఇది ఇలా ఉంటే శ్రవణ్‌సాయిని తామే కొట్టామని,యువతి తల్లి అంగీకరించిన నేపథ్యంలో, శ్రావణ్ సాయి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అమీన్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Facebook
WhatsApp
Twitter
Telegram