జీరో బిల్లు కోసం కరెంట్ మీటర్ మారిస్తే షాకిచ్చిన మరో బిల్లు…

కరెంట్ బిల్లు ఎక్కువ వస్తోందని,జీరో బిల్లు కోసం ప్రత్యామ్నాయంగా కరెంట్ మీటర్ మార్చుకున్న వ్యక్తికి విద్యుత్ శాఖ షాక్ ఇచ్చింది.దిమ్మ తిరిగి పోయేలా బిల్లు ఇచ్చి మరో మాట లేకుండా చేసింది.

వివరాల్లోకి వెళితే వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో తెలుగు వెంకటేష్ అనే కూలీ ఇంటికి రూ.7120 కరెంట్ బిల్లు వచ్చింది.కాగా గతంలో ఉన్న పెండింగ్ బిల్లు రూ.813 చెల్లించి… గృహజ్యోతి పథకం కోసం మీటర్ మార్పించాడు వెంకటేష్.కొత్త మీటర్ మార్చిన తర్వాత అనూహ్యంగా రూ.7120బిల్లు రావటంతో అవాక్కయ్యాడు.అయితే తాను కూలి పనులు చేస్తానని ,వచ్చిన ఆదాయం ఇంటి ఖర్చులకే సరిపోవటం లేదని,నెలకు ఇంత బిల్లు వస్తే ఎట్లా కట్టాలని తెలుగు వెంకటేష్ వాపోతున్నాడు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share