ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో నిన్న అర్ధరాత్రి చిరుత సంచారం కలకలాన్ని రేపింది.
పాతాళగంగ సమీపంలోని ఓ ఇంటి వద్ద అర్ధరాత్రి చిరుత ప్రత్యక్షమైంది… ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.దీంతో పాతాళగంగలో పుణ్యస్నానాలకు వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు