కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  బళ్లారిలో గాలి జనార్దన్‌రెడ్డిపై హత్యాయత్నం….

•ఎమ్మెల్యే భరత్‌రెడ్డి సన్నిహితుడి కాల్పులు

•గన్‌మన్‌ తుపాకీ లాక్కుని రెండు రౌండ్ల కాల్పులు జరిపిన సతీష్‌రెడ్డి

•తప్పించుకున్న మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి.

బళ్లారి లో మహర్షి వాల్మీకి విగ్రహ ఏర్పాటులో వివాదం చెలరేగిన ఘటనలో గాలి జనార్ధన రెడ్డి తృటిలో తప్పించుకున్నారు.కాగా పరస్పరం కాల్పులు జరిపిన కారణంగా ఒకరు మృతి చెందారు.మరొక వ్యక్తికి గాయాలయ్యాయి.

కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది…వివరాల్లోకి వెళితే తన ఇంటి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టొద్దని చెప్పినందుకు, బళ్లారి కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరుడు గాలి జనార్ధన్ రెడ్డి, అతని అనుచరులపై కాల్పులు జరిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలోని హవంబావి ప్రాంతంలో ఒక కార్యక్రమానికి సంబంధించి గాలి జనార్ధన్ రెడ్డి ప్రహరికి ఫ్లెక్సీలు కట్టేందుకు స్థానిక ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు సతీష్ రెడ్డి ప్రయత్నించారు.
ఫ్లెక్సీలు ఇంటి ప్రహరికి వద్దని, బయట కట్టుకోవాలని సతీష్ రెడ్డికి , గాలి జనార్ధన్ రెడ్డి అనుచరులు సూచించారు. దీంతో గాలి జనార్ధన్ రెడ్డి ఇంటి ముందు కుర్చి వేసుకుని కూర్చున్న సతీష్ రెడ్డి, నేను ఫ్లెక్సీలు ఇక్కడే కడతానని.. ఎవడు ఆపుతాడో చూస్తా అని అనడంతో, ఇరువర్గాల మధ్య మొదలైన రాళ్ల దాడి మొదలయ్యింది.అదే సమయంలో ఇంటికి వచ్చిన గాలి జనార్ధన్ రెడ్డి గన్ మెన్‌లు ఉద్రిక్తతను ఆపేందుకు గాల్లోకి కాల్పులు జరపగా, ఒక గన్ మెన్ నుండి తుపాకీ లాక్కొన్న సతీష్ రెడ్డి గాలి జనార్ధన్ రెడ్డి వైపు కాల్పులు జరిపారు . దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎమ్మెల్యే భరత్ రెడ్డి అనుచరుడు రాజశేఖర్ రెడ్డి మృతి చెందగా,సతీష్ రెడ్డి బుల్లెట్ గాయంతో తప్పించుకున్నారు. కాగా కాల్పుల నుండి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడిన,గాలి జనార్ధన్ భరత్ రెడ్డి అనుచరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఘటన అనంతరం స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, పెద్ద ఎత్తున రంగంలోకి దిగి ఇరు వర్గాలను పోలీసులు అదుపు చేశారు…అనంతరం ఎటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా చూసేందుకు 144 సెక్షన్ విధించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు