కావేరి జలాలపై మళ్లీ రాజుకున్న వివాదం: మేకేదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలని ప్రధానికి డీకే శివకుమార్ లేఖ.. తమిళనాడు అభ్యంతరం! లక్నో-ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు: టేకాఫ్‌కు కొద్ది నిమిషాల ముందే కలకలం.. 180 మంది ప్రయాణికులు సురక్షితం! అమెరికా-ఇరాన్ చారిత్రాత్మక శాంతి ఒప్పందం?: అణ్వాయుధాలు వద్దన్న ట్రంప్.. రాజీ పడే ప్రసక్తే లేదంటూ ఖండించిన ఇరాన్! కొల్లూరు మూకాంబిక అమ్మవారి చెంతకు తమిళనాడు సీఎం విజయ్: పొరుగు రాష్ట్రంలో తొలి పర్యటన.. గత ముఖ్యమంత్రుల ఆనవాయితీే! ‘అవి కన్నీళ్లు కాదు.. ఆనంద భాష్పాలు’: పవన్ కళ్యాణ్ సక్సెస్ జర్నీపై భార్య అన్నా లెజినోవా ఎమోషనల్ పోస్ట్! సమంత ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ డేట్ ఫిక్స్: సెన్సార్ పూర్తి.. జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల!

  అటవీ ప్రాంతంలో KLR కాలేజీ బస్సు బోల్తా…

మొండికుంట అటవీప్రాంతంలో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో, పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. విద్యార్థులతో ప్రయాణిస్తున్న కాలేజీ బస్సు మణుగూరు నుంచి పాల్వంచ వెళ్తుండగా ఘటన జరిగింది.బస్సులో ఇరుక్కున్న విద్యార్థులను బయటకు తీసేందుకు రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి.

మణుగూరు నుంచి పాల్వంచ వెళుతున్న KLR ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించిన బస్సు మొండికుంట అడవి ప్రాంతంలో బోల్తా పడింది…కాగా బస్సులో సుమారుగా 60 మంది విద్యార్థులు ఉన్నట్టు సమాచారం అందుతోంది.. గాయపడిన వారిని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది ఇలా ఉంటే సంఘటన జరిగిన ప్రాంతాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు సందర్శించి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు