పరివర్తన యశోద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :భద్రాచలం: ఏప్రిల్ 14
టుడే 9 ప్రతినిధి

స్థానిక వికాసం పాఠశాలలో దివ్యాంగుల విద్యార్థుల సమక్షంలో పరివర్తన యశోద ఫౌండేషన్ సేవాసమితి, ట్రైబల్ హెల్పింగ్ హాండ్స్ సొసైటీ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు డాక్టర్ భాను ప్రసాద్, వికాసం బాల బాలికల పాఠశాల ప్రధానోపాధ్యాయులు అరుణ కుమారి, మహాజన మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు మేకల లత, సిఐటియు జిల్లా అధ్యక్షులు కులగానే బ్రహ్మచారి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు అలవాల రాజా పెరియార్, పరిరక్షణ యశోద ఫౌండేషన్ సేవాసమితి అధ్యక్షులు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, హెల్పింగ్ హాండ్స్ సొసైటీ అధ్యక్షులు కుంజ అర్జున్, సోడి రాజా, మర్మం చిట్టిబాబు, అంబేద్కర్, కవి , రచయిత్రి కుంజా నాగ లక్ష్మీ, చెల కృష్ణ వేణి, కొమ్మగిరి నిహాలు భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమానత్వ సౌధానికి పునాది వేసిన జ్ఞాన శిఖరం, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా విద్యార్థిని,విద్యార్ధులకు తో కేక్ కటింగ్ స్వీట్స్ పంచి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం ఉద్యమకారులు డాక్టర్ భానుప్రసాద్ వికాసం హెచ్ఎం అరుణ కుమారీ లు మాట్లాడుతూ .జ్ఞానం అనేది మనిషి జీవితానికి మూలాధారం
కేవలం చదువు మాత్రమే కాదని పేర్కొంటూ, ఆ చదువు మనిషిలో విచక్షణా జ్ఞానాన్ని, నైతికతను పెంపొందించాలని ఆకాంక్షించారు. మతం మనిషి కోసం ఉండాలే కానీ, మనిషి మతం కోసం కాదు అని చాటిచెప్పిన విప్లవవాది. అణగారిన వర్గాల గొంతుకగా మారి, అంటరానితనం అనే అంధకారాన్ని రూపుమాపడానికి తన జీవితాంతం కృషి చేసిన ధీశాలి అని కొనియాడారు. ప్రతి ఒక్కరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత చదువులు చదివి గ్రామాల్లో మార్పు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వికాసం విద్యార్థిని విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share