పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో: భద్రాచలం: ఏప్రిల్ 14:టుడే 9 ప్రతినిధి
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగాస్థానిక అంబేద్కర్ సెంటర్ నందు ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.

అనంతరం స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. అటవీ అభివృద్ధి శాఖ చైర్మన్ పోదెం. వీరయ్య, భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ ఉపసర్పంచ్ రత్నం కవిత.మాట్లాడుతూ సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనే విలువలను భారత సమాజానికి అందించి, ప్రతి మనిషి గౌరవంతో జీవించే హక్కు కల్పించిన మహోన్నత నాయకుడు అంబేద్కర్ .ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, సమానత్వ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్టి, ఎస్ సి, బి సి జేఏసీ నాయకులు, పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు యూత్ నాయకులు. మహిళలు. స్థానికులు తదితరులు పాల్గొన్నారు.









